Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ అంతంత మాత్రంగనే ఉంది. గత రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో భక్తుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. వర్షంతో పాటు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని భావించి తిరుమల పర్యటనను రద్దు చేసుకుని ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలలో మామూలుగానే సోమవారం నుంచి గురువారం భక్తులు రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. లడ్డూ ప్రసాదాల కౌంటర్ వద్ద కూడా పెద్దగా రష్ లేదు. భక్తుల సందడి తక్కువగా ఉండటంతో స్వామి వారిని సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు.