Pawan Kalyan : శాసనసభ సాక్షిగా వైసీపీ అవినీతిని బయటపెట్టిన పవన్
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని శాసనసభ సాక్షిగా బయటపెట్టారు;

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని శాసనసభ సాక్షిగా బయటపెట్టారు. గత ప్రభుత్వ హాయంలో ఉపాధి హమీ అమలు పథకంలో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాము జరిపించిన సోషల్ మీడియా ఆడిట్ లో ఈ విషయం స్పష్టం అయిందని పవన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హమీ అమలు పథకం అమలుపై అధ్యయనం చేస్తే అనేక రకాలైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
అందరూ ఒక్కటయి...
గ్రూపులన్నీ ఒక్కటిగా మారి, జేసీబీలతో పెట్టి పనులు చేయించి బిల్లులు చేసుకున్నారని కూడా పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించిన ఒక కీలక మైన అధికారిని తాము అధికారం చేపట్టిన వెంటనే విధుల నుంచి తప్పించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సదుద్దేశ్యంతో ఉపాధి హామీ పథకాన్ని రోజు వారీ కూలీల కోసం అమలు చేస్తే దానిని పక్కదారి పట్టిస్తూ అందిన కాడికి దోచుకునే పరిస్థితి తలెత్తిందని, జరిగిన 250 కోట్లలో 70 కోట్ల మేర నిధులను రాబట్టేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.