Pawan Kalyan : కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ.. నాగబాబు విషయంపై

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు

Update: 2024-12-16 07:49 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మధ్యహ్నాం మూడు గంటలకు పవన్ కల్యాణ్చంద్రబాబును కలవనున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలతో పాటు కొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

మంత్రివర్గంలో...
తన సోదరుడు నాగబాబు మంత్రి వర్గంలో చేరిక అంశంపై కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించే అవకాశముంది. నాగబాబు ఎప్పుడు మంత్రివర్గంలో చేరేది తేదీ వీరి మధ్య ప్రస్తావనకు వచ్చేఛాన్స్ ఉంది. ఇప్పటికే నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో తేదీని ఈరోజు ఖరారు చేసే అవకాశముందనితెలిసింది.


Tags:    

Similar News