Tirumala : నేడు తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భకత్లు రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
తిరుమలలో భకత్లు రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈరోజు శనివారం కావడంతో భక్తులు ఎక్కువగానే ఉన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో భక్తులు ఇంకా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకునే అవకాశాలున్నాయి.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.