Tirumala : జనవరి నెలలో శ్రీవారి ఆదాయం ఎంతంటే?

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు

Update: 2024-02-02 05:35 GMT

 income of october in tirumala

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే తిరుమల కొండ ఎప్పుడూ కిటకిటలాడుతుంది. ఆయనకు వడ్డీ కాసుల వాడు అని కూడా పేరుంది. అలాంటి తిరుమలకు ప్రతి నెల వచ్చే ఆదాయం వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిధులతో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, హిందూ ధర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటుంది.

కొత్త ఏడాది తొలి నెల....
జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆదాయం 116.46 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కొత్త ఏడాది కావడం, పండగ సెలవులు ఎక్కువగా ఉండటంతో భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. జనవరి నెలలో 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1.03 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. 46 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.


Tags:    

Similar News