రద్దీ ఎక్కువే.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
శుక్రవారం ఉదయం వరకూ శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి
కలియుగ దైవం, తిరుమల గిరులపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం వరకూ శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిటి తెలిపింది. టైం స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
నిన్న (నవంబర్ 10) 61,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,133 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామి వారికి రూ.3.46 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి పేర్కొంది.