భోగిమంటల్ని బూటుకాలితో తన్నిన పోలీసులు

పోలీసులు సంప్రదాయ భోగి మంటలను బూట్లతో ఆర్పివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-01-14 07:14 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేడు భోగి పర్వదినం సందర్భంగా.. తెల్లవారుజాము నుండి.. వాడవాడలా.. భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. కానీ.. సత్యసాయి జిల్లా ధర్మవరంలో భోగివేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీవో నం 1ని టీడీపీ నేతలు భోగిమంటల్లో వేసి కాల్చడంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంప్రదాయంగా భావించే భోగి మంటల్ని బూటు కాళ్లతో తన్ని.. మంటల్ని ఆర్పడంతో.. ఉద్రిక్తత నెలకొంది.

నాసిరకం పాలనపై టీడీపీ నేతలు తమ నిరసనను ఆపడం సరికాదని, వైఎస్‌ జగన్‌ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సంప్రదాయ భోగి మంటలను బూట్లతో ఆర్పివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై బహిరంగ సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1పై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నారావారిపల్లెలో చంద్రబాబు ఈ ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అదేమాదిరిగా ఆ ప్రతులను దగ్ధం చేస్తున్నారు.




Tags:    

Similar News