నేడు వర్మ క్వాష్ పిటీషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రామ్ గోపాల్ వర్మ పిటీషన్ విచారణకు రానుంది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు రామ్ గోపాల్ వర్మ పిటీషన్ విచారణకు రానుంది. తనపైన నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలని వర్మ హైకోర్టులో పిటీషన్ వేశారు. వరసగా ఒకే విషయంపై కేసులు నమోదు కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్మ పిటీషన్ వేశారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
వరసగా నమోదయిన కేసులపై...
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎనిమిది చోట్ల ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మద్దిపాడు, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ లలో నమోదయిన కేసుపై ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.