Ys Jagan : వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేశారు.. షర్మిలపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ ఛీఫ్

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ , ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయ

Update: 2024-10-23 03:51 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ఓ వైపు షర్మిల కూడా కారణమనే టాక్ ఉంది. ఇక ప్రతి పక్షంలో ఉన్నా కూడా వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూనే వస్తోంది షర్మిల. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) పిటిషన్‌ను ఫైల్ చేశారు వైఎస్ జగన్.వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి)కి సమర్పించిన పిటిషన్‌లో తన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని. తమ తల్లి వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటీషన్ లో ఏమన్నారంటే..?
“వైఎస్ షర్మిల, కృతజ్ఞత లేకుండా, నా శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా, నన్ను తీవ్రంగా బాధించే చర్యలు చేస్తూ వెళుతోంది. ఆమె చేసిన పనులే కాకుండా, బహిరంగంగా అసత్య, తప్పుడు ప్రకటనలతో పాటు, రాజకీయంగా నన్ను వ్యతిరేకించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా అపకీర్తిని కలిగించాయి." అని తన పిటీషన్ లో వివరించారు. తన సోదరి ఎంతో మానసిక క్షోభను కూడా కలిగించిందని వైఎస్ జగన్ తెలిపారు.తమ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలన్నీ దెబ్బతిన్నాయని, ఆమె చేసిన ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించినవి ఇవి తనకు తీవ్ర వేదనకు గురిచేశాయని వైఎస్ జగన్ అన్నారు. సరస్వతీ పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఎంవోయూను ఉల్లంఘించి...
షర్మిల, విజయమ్మ తదితరులు 2024 జూలైలో నిబంధనలను పాటించకుండా, గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) ఉల్లంఘించి అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్, భారతి ఆరోపించారు. జూలై 6, 2024 నాటి బోర్డు తీర్మానం ద్వారా జరిగిన వాటా బదిలీలు కంపెనీల చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం వాటా బదిలీ ఫారమ్‌లు లేదా ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్‌లను సమర్పించకుండానే జరిగాయని జగన్, భారతి పిటిషన్‌లో పేర్కొన్నారు.ఆగస్టు 31, 2019 నాటి ఎంవోయూ ప్రకారం ఉన్న కొన్ని ఆస్తులు, వాటాలను షర్మిలకు బదిలీ చేయాలనే తన ఉద్దేశం పూర్తిగా ప్రేమ, ఆప్యాయతపై ఆధారపడి ఉందని మాజీ ముఖ్యమంత్రి హైలైట్ చేశారు.
ఆస్తుల బదిలీని...
ఇటీవలి సంఘటనల కారణంగా తోబుట్టువుల మధ్య ప్రేమ లేదని, వాటాలు లేదా ఆస్తుల బదిలీని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నానని వైఎస్ జగన్ అన్నారు. జగన్ నుండి విజయమ్మకు 74,26,294 ఈక్విటీ షేర్లు, భారతి నుండి విజయమ్మకు 40,50,000 షేర్లు, మరో పిటిషనర్ నుండి 12,00,000 షేర్లను ప్రతివాదులు 3, 4కి బదిలీ చేయడాన్ని రద్దు చేయాలని జగన్, వైఎస్ భారతి ఇప్పుడు NCLTని అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్, వైఎస్ షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది. జగన్ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం న్యాయస్థానానికి చేరినట్లయింది.


Tags:    

Similar News