మద్యంమత్తులో డ్రైవర్.. రాత్రివేళ నడిరోడ్డుపై 40 మంది నారాయణ విద్యార్థినులు

డ్రైవర్ పరిస్థితిని గుర్తించిన స్థానికులు పోలీసులకు విషయం తెలియచేశారు. పోలీసులు స్పందించలేదు. హడావిడిగా..

Update: 2022-11-17 05:21 GMT

narayana college 

నారాయణ విద్యాసంస్థల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఘటన. విద్యార్థుల పట్ల నారాయణ విద్యాసంస్థలకు ఎంత బాధ్యత ఉందో చూపే ఘటన ఇది. 40 మందికి పైగా విద్యార్థినులున్న కాలేజీ బస్సును మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కు అప్పగించింది నారాయణ కళాశాల యాజమాన్యం. వారందరినీ ఇళ్లకు చేర్చాలని తెలిపింది. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న డ్రైవర్.. బాలయ్య అనే డ్రైవర్ కొద్ది దూరం వెళ్లేసరికి నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బస్సును నిలిపివేశాడు. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో జరిగిందీ ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. వివరాల్లోకి వెళితే అధిక మోతాదులో మద్యం సేవించిన డ్రైవర్ కు నారాయణ కళాశాల బస్సులో విద్యార్థులను ఇళ్లకు చేర్చాల్సిందిగా కలశాల యజమాన్యం బాధ్యతని అప్పగించింది. పామర్రు మండలం కనుమూరు వద్దకు వచ్చేసరికి, మద్యం మత్తు ఎక్కువైన డ్రైవర్ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై నారాయణ కళాశాల బస్సును అడ్డదిడ్డంగా నడిపాడు. దాంతో విద్యార్థులు భయాందోళనతో కేకలు పెట్టారు. బస్సును నడిరోడ్డుపై ఆపేసి నిద్రపోయాడు బాలయ్య. ఆందోళన చెందిన విద్యార్థులు బస్సు నుండి బయటకు దిగి నారాయణ కళాశాల యజమాన్యానికి సమాచారం అందించారు.
డ్రైవర్ పరిస్థితిని గుర్తించిన స్థానికులు పోలీసులకు విషయం తెలియచేశారు. పోలీసులు స్పందించలేదు. హడావిడిగా బస్సు వద్దకు వచ్చిన కళాశాల ప్రతినిధులు, జరుగుతున్న తతంగాన్ని వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తిస్తూ, విద్యార్థులు మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేశారు. కార్పొరేట్ కళాశాల అయ్యి ఉండి బాధ్యత లేని వ్యక్తి చేతిలో పిల్లల ప్రాణాలు పెట్టడం దారుణమని స్థానికులు మండిపడ్డారు. విద్యార్థులకు జరగరానిదేమైనా జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ బాధ్యత అని ప్రశ్నించారు. ఇంత జరిగినా.. ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్టు నారాయణ కళాశాల ప్రతినిధులు వ్యవహరించడం గమనార్హం. కొందరు విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లగా.. మరికొందరిని మరో డ్రైవర్ వచ్చాక అదే బస్సులో ఇంటికి పంపించారు.


Tags:    

Similar News