ఏపీలో భూప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భూమి కంపిచింది
ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భూమి కంపిచింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోకవర్గంలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుపాడు మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అయితే భూప్రకంపనలు రెండు మూడు సెకన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు.
అచ్చంపేట మండలంలోనూ...
అలాగే అచ్చంపేట మండలంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. అచ్చంపేట మండలం చల్లగరిగ, గింజుపల్ి గ్రామాల్లో ఉదయం 7.26 నిమిషాలకు భూ ప్రకంపనలు సంభవించాయని ప్రజలు చెబుతున్నారు. పెద్ద శబ్దంతో ఒక సెకను పాటు భూమి కంపించిందని గ్రామస్థులు చెప్పారు. గతంలో కూడా కొన్ని సార్లు మాదిపాడు, జడపల్లి తండాలో భూమి కంపించిందని తెలిపారు. భూప్రకపంనలు కారణంగా ఇళ్లలో సామాన్లు కింద పడిపోయాయి.