Andhra Pradesh : ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రకటించిన విద్యాశాఖ.. ఎన్నిరోజులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త విద్యాసంవత్సరంలో సెలవులను విద్యాశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త విద్యాసంవత్సరంలో సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 2024 - 25 సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేస్తాయని అకడమిక్ కేలండర్ లో తెలిపారు. అయితే ఇదే సమయంలో వివిధ పండగల నిమిత్తం కొత్త ఏడాది 83 సెలవులు ఉంటాయని తెలిపింది. ఉన్నత పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పనిచేయనున్నాయి.
పండగ సెలవులు...
ప్రాధమిక పాఠశాలలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయి. చివరి పీరియడ్ ను ఖచ్చితంగా క్రీడల కోసం కేటాయించాలన్నారు. మండు వేసవిలో ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ నిర్వహించనున్నారు. ఇక సెలవుల విషయానికి వస్తే అక్టోబరు 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. క్రిస్మస్ సెలవులు క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబరు 22 నుంచి 29 వరకూ ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.