Ys Jagan : వైఎస్ జగన్ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు.
వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్థులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మినీ సెక్రటేరియట్ కుచేరుకున్న జగన్ అంతకు ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు.
నేతలతో భేటీ
ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత ఆయన పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీనేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి చేయాల్సిన కృషితో పాటు అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా దిశానిర్దేశం చేశారు.