Ap Politics : ఓవర్‌ఆల్ గా చుట్టేసి వచ్చిన అధినేతలు.. ముమ్మరంగా జరిగిన ప్రచారం
ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లున్నారు. 46389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లున్నారు. 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. దీంతో ఇక్కడ కేంద్ర బలగాలు మొహరించనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. హోరా హోరీగా టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా, వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. అలాగే కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కలసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
సభలు, రోడ్ షోలతో...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొత్తం 106 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇందులో 16 సిద్ధం సభలున్నాయి. 34 బహిరంగ సభలను నిర్వహించారు. 14 నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరుతో సభలను నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ 43 సభల్లో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన కూటమిగా పన్నెండు సభలను నిర్వహించాయి. కాంగ్రెస్ 120 సభలను నిర్వహించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. మొత్తం మీద ప్రచారం ముగిసింది. ఇక ఓటర్ల తీర్పు మిగిలింది.