ఏపీలో పెరుగుతున్న విద్యుత్ కోతలు.. రాత్రివేళల్లోనూ కోతలు షురూ !

ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు ఆరు గంటలకు పైగా కరెంట్ కోతలు విధిస్తున్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో..

Update: 2022-04-07 09:00 GMT

అమరావతి : ఏపీలో విపరీతమైన విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలతో పాటు పల్లె ప్రాంతాల్లోనూ ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు ఆరు గంటలకు పైగా కరెంట్ కోతలు విధిస్తున్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో 11 గంటల నుంచి రాత్రి వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.

మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. రాజమండ్రిలో రాత్రి 9.30 గంటల నుంచి కరెంట్ కోతలు విధిస్తున్నారు. అసలే వేసవికాలం.. ఆపై కరెంటు కోతలు ఉండటంతో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక విద్యుత్ కోతలకు నిరసనగా.. రాజమండ్రిలో టిడిపి శ్రేణులు విద్యుత్ స్టేషన్ ను ముట్టడించాయి.


Tags:    

Similar News