గోరంట్ల మాధవ్ దెబ్బకు 11మంది పోలీసుల సస్పెన్షన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది;

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది. గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయనకు సెల్ ఫోన్ ఇచ్చి ఫోన్ మాట్లాడేలా చేశారన్న ఆరోపణలు వినిపించాయి.
సమాచారాన్ని ఇచ్చి...
అదే సమయంలో చేబ్రోలు కిరణ్ ను గుంటూరుకు తెస్తున్నారన్న సమాచారం కూడా పోలీసుల నుంచే గోరంట్ల మాధవ్ కు లీక్ చేశారని విచారణలో వెల్లడయింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అరండల్‌పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం, నగరంపాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్సైలు ఆంథోని, ఏడుకొండలు, నగరంపాలెం స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్‌పేటకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు.