ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం మరో ఝలక్
ఏపీ లో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. అందుకే ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన కూడదని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పారు.
నో పర్మిషన్....
ఈ కార్యక్రమం చట్ట పరంగా విరుద్దమని తెలిపారు. ఉద్యోగులు తమ కాండాక్ట్ రూల్స్ ప్రకారం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని తెలిపారు. బయట వ్యక్తులు ఇందులో జొరబడి శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులు తమ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఆయన చెప్పారు. మరోవైపు రేపు జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.