చర్చలకు నో.. లేఖల ద్వారానే?

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి

Update: 2022-01-25 07:40 GMT

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే తమ ప్రతిపాదనలను ఒక లేఖ ద్వారా మంత్రుల కమిటీకి అందజేయాలని నిర్ణయించింది. పీఆర్సీ జీవోను రద్దు చేయకుండా చర్చలకు వెళ్లకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది.

మూడు పేజీల లేఖ....
దీనిపై ఉద్యోగ సంఘాల నేతల జేఏసీ సమావేశమై చర్చించారు. జీవోను రద్దు చేయకుండా చర్చలకు వెళ్లడం బాగుండదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో చర్చలను పూర్తిగా పక్కన పెట్ట కూడదని కూడా కొందరు వాదించారు. దీంతో మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించారు. పీఆర్సీ జీవోను రద్దు చేయడం, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని మంత్రుల కమిటీకి మూడు పేజీల లేఖను రాయనున్నారు. ఈ లేఖను తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందం మంత్రుల కమిటీకి ఇవ్వనుంది.


Tags:    

Similar News