తమను చెడుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది
చర్చలు తమకు ఇష్టం లేనట్లుగా ప్రభుత్వం మాట్లాడటం తగదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు
చర్చలు తమకు ఇష్టం లేనట్లుగా ప్రభుత్వం మాట్లాడటం తగదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తమ డిమాండ్లు స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పామన్నారు. మొన్న గంటన్నర పాటు మంత్రుల కమిటీతో చర్చించి వచ్చామన్నారు. సంప్రదింపుల కమిటీతో తాము చర్చలు జరపడం ఇష్టలేదన్నట్లు ప్రచారం చేయడం మంచిది కాదని, తమపై చెడు అభిప్రాయం కలిగేలా ప్రచారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన చెందారు.
మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే?
తాము ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నామని, అయితే ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై కొత్త జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం వత్తిడి తెస్తుందన్నారు. తమ మూడు డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే చర్చలకు హాజరవుతామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లన పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.