చర్యలకు దిగితే ఇప్పుడే సమ్మె మొదలు పెడతాం
ప్రభుత్వం కవ్పింపు చర్యలకు దిగడం సరికాదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి
ప్రభుత్వం కవ్పింపు చర్యలకు దిగడం సరికాదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమ డిమాండ్లను పక్కన పెట్టి కొత్త జీతాల చెల్లింపునకు అధికారులు వత్తిడి తేవం సరికాదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలకు దిగినా ఇప్పుడే సమ్మె మొదలు పెట్టాల్సి ఉంటుందని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
శాంతియుతంగా....
తాము శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ వాదనను కూడా పరిగిణనలోకి తీసుకుని కొత్త పీఆర్సీ జీవోను నిలుపుదల చేయాలని, అప్పటి వరకూ చర్చలకు వెళ్లమని చెప్పినా, జీవో రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే తాము కూడా సమ్మె ఇప్పుడే మొదలు పెడతామని ఆయన హెచ్చరించారు.