ఏపీపై ఈడీ నజర్.. అవినీతి ఆరోపణలపై..?

ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ అధారిటీ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. 26 మందికి నోటీసులు జారీ చేసింది.

Update: 2022-12-04 08:14 GMT

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్‌మెంట్ అధారిటీ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. 26 మందికి నోటీసులు జారీ చేసింది. కార్పొరేషన్ మాజీ ఎండీ గంటా సుబ్బారావుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణలకు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు హైదరాబాద్ లో ఈడీ విచారణ చేయనుంది. ఇన్ వెబ్ సిరీస్ నుంచి సీమెన్స్ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్....
370 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుని జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలున్నాయి. జర్మనీకి చెందిన సీ మెన్స్ సంస్థతో గత చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. యువతకు ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News