ఎన్ఆర్ఐ కళాశాల ఆస్తులు అటాచ్

మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు

Update: 2023-05-12 02:34 GMT

మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. కోవిడ్‌ సమయంలో సొసైటీ పేరుతో వసూలైన డబ్బులను దారి మళ్లించినట్టు ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యంపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గతంలో ఈడీ అధికారులు పెద్దయెత్తున కళాశాల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

భవనాలు సీజ్....
భారీగా నిధులను మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. దీంతో ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు చెందిన రూ.307 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. రూ.15 కోట్ల బ్యాంకు లావాదేవీలతో పాటు భూములు, భవనాలను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు.


Tags:    

Similar News