కోట్ల నిధులను దారి మళ్లించారు.. ఈడీ వెల్లడి

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో సోదాలు నిర్వహించామని, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు

Update: 2022-12-07 08:09 GMT

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో సోదాలు నిర్వహించామని, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ అధికారులు తెలిపారు. సొసైటీ సభ్యులు పీఎంఎల్ఐ చట్టాలను ఉల్లంఘించారన్నారు. కాకినాడ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. కోవిడ్ సమయంలో వసూలు చేసిన డబ్బులను పెద్దయెత్తున రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్బుబడిగా పెట్టినట్లు తమ తనిఖీల్లో వెల్లడయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే తాము సోదాలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

కోట్ల రూపాయలు డైవర్ట్ అయ్యాయి..
ఎన్ఆర్ఐ నిధులతో సొంత భవనాలను కట్టుకున్నారని తెలిపారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లకు చెందిన 53 ఆస్తులను గుర్తించామని తెలిపారు. వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోట్లాది రూపాయలను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మెడికల్ సీట్ల కేటాయింపులోనూ అక్రమాలు జరిగాయన్నారు. కోట్ల రూపాయల నిధుల దారి మళ్లింపునకు సంబంధించి ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. సొసైటీ అకౌంట్ కు వచ్చిన నిధులన్నీ మరో అకౌంట్ కు బదిలీ అయ్యాయని అన్నారు. ఎన్నారై అకాడమీపై వచిరాణ కొనసాగుతుందని ఈడీ తెలిపింది.


Tags:    

Similar News