ఏపీ పోలీసులపై నారా లోకేష్ పై ఆగ్రహం..

ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ

Update: 2022-03-08 10:09 GMT

అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఏపీ పోలీసులపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేక వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అన్న అనుమానాలు నెలకొన్నాయన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ ఆరోపించారు.

"ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు.
మా టిడిపి కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా వుంటుంది. సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి. చట్టాలని గౌరవిస్తున్నామని ...పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు." అని హెచ్చరించారు.


Tags:    

Similar News