రాయలసీమ ద్రోహి జగన్.. నిమ్మల ధ్వజం
ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు
ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. కరవుతో అల్లాడుతున్న రాయలసీమను మరింత కొల్లుగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రైతులను సేకరించిన భూములను తాకట్టు పెట్టి 400 కోట్ల రుణం తీసుకున్నారని, ఒక్క పరిశ్రమను కూడా పెట్టలేదని నిమ్మల ఆరోపించారు. దివాలా తీసే జగన్ బంధువులకు చెందిన హరిత ఫెర్టిలైజర్ కంపెనీకి భూములను కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు.
భూములను....
పరిశ్రమలను పక్కన పెట్టేశారని, బ్యాంకుల రుణాలను పొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకే భూమిని మూడు రకాలుగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మారారన్నాడు. ప్రజల నుంచి త్వరలోనే తిరుగుబాటు తప్పదని నిమ్మల కిష్టప్ప హెచ్చరించారు. రాయలసీమకు పంట నష్టం జరిగినా రైతులకు ఇవ్వలేదన్నారు. కియా పరిశ్రమను తీసుకు రాబట్టి ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు.