ఎగుమతులలో టాప్ గేర్ లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్
ముఖ్యంగా సముద్ర వాణిజ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం నుంచి నాలుగు ఓడ రేవుల ద్వారా ఎగుమతులు 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, లాజిస్టిక్, ఎంతచౌకగా ఎగుమతులు చేయగలమనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తూనే ఉంది.
ముఖ్యంగా సముద్ర వాణిజ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశీయ వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో క్షీణత నమోదవుతున్నా, ఆంధ్రప్రదేశ్ వృద్ధి సాధిస్తూ ఉండడం విశేషం. రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఎగుమతుల ప్రోత్సాహానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. విదేశాల్లో డిమాండ్ ఉన్న మన రాష్ట్ర ఉత్పత్తులను గుర్తించి, అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటోంది. రవాణా, ఇతర మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. ఎగుమతుల కోసం దేశంలో ఏక్కడా లేని విధంగా రూ.20,000 కోట్లతో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి నాలుగు పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతిఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. అంతకు ముందు రెండేళ్ల క్రితం 20వ స్థానంలో ఉండగా, గత ఏడాదికి 12 స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ర్యాంకుకు చేరుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు, కల్పిస్తున్న మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2018–19లో రూ.8,929 కోట్లు ఉండగా 2022–23లో ఈ మొత్తం రూ.22,761.99 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగింది. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, కల్పించిన మార్కెటింగ్ సౌకర్యాల ఫలితంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని అధికారులు అంటున్నారు. ఇక ఏటా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరుగుతూ ఉండగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతూ ఉన్నాయి.