లైంగిక వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అనంతపురం జిల్లా చినమత్తూరు మండలం దేమకేతుపల్లి గ్రామసచివాలయంలో సావిత్రి అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది.
ఆడపిల్లలకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదురైతే మహిళా పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటి మహిళా పోలీసులకే ఇలాంటి వేధింపులు ఎదురైతే ఏం చేస్తారు ? ఎవరికి చెప్పుకోవాలి ? తోటి ఉద్యోగులే లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
అనంతపురం జిల్లా చినమత్తూరు మండలం దేమకేతుపల్లి గ్రామసచివాలయంలో సావిత్రి అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె సహోద్యోగి అయిన ఓ వ్యక్తి సావిత్రిని తరచూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఆమె ఎంత వారించినా.. మళ్లీ మళ్లీ వేధిస్తూనే ఉండటంతో భరించలేని సావిత్రి.. చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితమే లేపాక్షి చెరువులో సావిత్రి మృతదేహం లభ్యమవ్వగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తోటి ఉద్యోగి లైంగిక వేధింపులే తన మృతికి కారణమంటూ సావిత్రి సూసైడ్ నోట్ రాయగా.. పోలీసులు ఆ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.