Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు తుది విచారణ

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో తుది విచారణ జరగనుంది;

Update: 2025-03-20 05:17 GMT
vallabhaneni vamsi, ex mla, bail petition,  sc and st court
  • whatsapp icon

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో తుది విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ ను వల్లభనేని వంశీ దాఖలు చేశారు. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో గత కొద్ది కాలంగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో వరస కేసులు నమోదవుతున్నాయి.

ఒక్కొక్క కేసుకు సంబంధించి...
ఒక్కొక్క కేసుకు సంబంధించి ఆయన బెయిల్ పిటీషన్ ను వేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉండటంతో ఈ కేసులో కూడా బెయిల్ పిటీషన్ వేశారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.


Tags:    

Similar News