ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి పెద్దయెత్తున వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు.
అప్రమత్తంగా ఉండాలని...
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులు గా ఉంది. పులిచింతల వద్ద అవుట్ ఫ్లో 4.25 లక్షల క్యూసెక్కులు ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.