ప్రమాదం అంచున లంక గ్రామాలు

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. 60 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Update: 2022-07-13 03:16 GMT

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. 60 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. కొన్ని భవనాల వద్దకు నీరు చేరడంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

రాకపోకలు...
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. మంచి నీటి కోసం లంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులను అధికారులు అందుబాటులో ఉంచినా లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పంపిణీ చేయడం లేదు. ఉప నదులకు కూడా భారీ గా వరద నీరు చేరుతుండటంతో లంక గ్రామాలు భయంతో వణికి పోతున్నారు.


Tags:    

Similar News