శ్రీశైలం వద్ద పెరిగిన నీటి ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది.

Update: 2022-08-24 02:44 GMT

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గేట్లు ఎత్తి అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఒక గేటును పది అడుగల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 1.55,415 లక్షల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 91,227 క్యూసెక్కులుగా ఉంది.

పూర్తి స్థాయి నీటి మట్టం...
శ్రీశైలం జలాయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే స్థాయిలో నీటి నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News