దడ పుట్టిస్తున్న ధవేళేశ్వరం
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్యారేజీ నుంచి 15.37 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద నీరు మరింత పెరిగే అవకాశముందని విపత్తుల సంస్థ డైరెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మూడో ప్రమాద హెచ్చరిక వస్తే....
వరద ఉధృతి పెరిగితే ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదే జరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండాలలోని 524 గ్రామాలపై ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాో 8, అల్లూరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాలపై ప్రభావం చూపనుంది. దీంతో అధికారులను విపత్తు సంస్థ అప్రమత్తం చేసింది. ఆయా గ్రామాల్లోని ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.