శ్రీశైలానికి భారీగా వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది
శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతోంది. మొత్తం 1,73,282 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్ కు వస్తుంది. ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు.
ఇలాగే ఉంటే....
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 882.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కావడంతో మరికొద్దిరోజుల్లోనే మిగిలిన గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీలు నమోదయింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి.