ప్రాజెక్టులకు జల కళ.. నిండిన జలాశయాలు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు

Update: 2024-08-31 06:30 GMT

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి చెందిన తొమ్మది గేట్లను పది అడుగుల మేర అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,27,610 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,21,077 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్లం 885.00 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8070 టీఎంసీలు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

ప్రకాశం బ్యారేజీకీ...
మరో కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఈరోజు ఉదయం ఇన్ ఫ్లో 3,32,374 క్యూసెక్కులుగా నమోదు అయింది. అధికారులు పంట కాలువలకు 9,768 క్యూసెక్కులు, సముద్రంలోకి 3,22,606 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నది తీరా ప్రాంతాల ప్రజలు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News