ఖజానా డొల్ల... విచ్చలవిడిగా అప్పులు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2022-06-14 07:44 GMT

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టి తప్పుడు లెక్కలతో ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రెవెన్యూ, రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అప్పులు తెస్తూ వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను బదిలీలు చేస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు యనమల రామకృష్ణుడు.

కేంద్ర నిధులు...
15వ ఆర్థిక సంఘం 6 వేల కోట్లు నిధులు విడుదల చేసిందని, జలజీవన్ మిషన్ కింద వచ్చిన ఏడు వేల కోట్ల రూపాయలను ఏం చేశారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇతర పథకాలకు మళ్లిస్తుండటంతో కేంద్రం గత ఏడాది నుంచి నిధులు కూడా విడుదల చేయడం లేదన్నారు. నడికుడి - రైల్వే ప్రాజెక్టు ఆలస్యం కావడానికి జగన్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంకు తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను బయటపెట్టాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News