నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై విచారణ నేడు జరగనుంది;

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై విచారణ నేడు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక నాయస్థానంలో విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్న సంగతి తెలిసిందే. వంశీపై వరుసగా కోర్టులో పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి. అలాగే కస్టడీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.
వరస కేసులు...
వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. అదే సమయంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. ఇరువర్గాల వాదనల విన్న తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వంశీపై వరస కేసులు నమోదు అవ్వడంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరొక కేసులో ఆయనకు రిమాండ్ విధించే అవకాశముందని చెబుతున్నారు.