విడదల రజని హైకోర్టులో క్వాష్ పిటీషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజిని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.;

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజిని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీసు స్టేషన్లో తనపై నమోదైన కేసు అక్రమం అని కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారరు. మాజీ మంత్రి విడదల రజిని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
తనపై నమోదయిన కేసులను...
విడదల రజనీపై ఇటీవల చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయవద్దని కోరుతూ ఆమె ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతోనే తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా కేసులు పెడుతున్నారని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు.