వైఎస్ జగన్ తో భేటీ... అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు

Update: 2022-01-21 04:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఆయన భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2014లో ఖమ్మం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణలో వైసీపీ బలోపేతానికి జగన్ ఆసక్తి చూపకపోవడంతో ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లోె పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ లభించలేదు.

పార్టీపై అసంతృప్తితో....
గత కొద్దినెలలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ఆయనను పట్టించుకోక పోవడంతో పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారు. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టారు. ఈ విషయంపై చర్చించేందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ తో భేటీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News