వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరోసారి రిలీఫ్ లభించింది.;

Update: 2024-08-20 12:13 GMT
vallabhaneni vamsi, ex mla, gannavaram, anticipatory bail
  • whatsapp icon

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరోసారి రిలీఫ్ లభించింది. ఆయన ముందస్తు బెయిల్ ను పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను ఈ నెల 28వ తేదీ నాటికి వాయిదా వేసింది. ఈ నెల 28వ తేదీ వరకూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దని కోరింది.

టీడీపీ కార్యాలయంపై...
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయనన హైకోర్టును ఆశ్రయించగా మరోసారి న్యాయస్థానం వల్లభనేని వంశీకి ఊరట దక్కేలా నిర్ణయం ప్రకటించింది. మరో వారం రోజుల పాటు ఆయనకు రిలీఫ్ అని చెప్పాలి.


Tags:    

Similar News