సీఎం జగన్ ఆనందం కోసమే చంద్రబాబు నాయుడు అరెస్ట్: గంటా శ్రీనివాసరావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2023-09-09 03:33 GMT

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను దిశా ఏసీపీ వివేకానంద అదుపులోకి తీసుకున్నారు. గంటా మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అర్థరాత్రి హైడ్రామా చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని అక్కసుతో, చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని గంటా తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావును అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని ఆయన నివాసంలో శ్రీనివాస రావుతోపాటు ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆయన కుమారుడు రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటులో గంటా పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సీఐడీ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు, గంటాను అరెస్ట్ చేసారు.


Tags:    

Similar News