విశాఖ సదస్సుపై ఇద్దరిదీ ఒకటే మాట
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను స్వాగతిస్తామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడయితే ఫైర్ అయ్యారు;
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను స్వాగతిస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెట్టుబడులు ఎవరు పెట్టినా మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నాలుగేళ్ల తరువాత ఇప్పుడే ఎందుకు చేస్తున్నారనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గతంలో అనేక పరిశ్రమలు ఏపీ నుంచి ఎందుకు వెళ్లిపోయాయో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఎందుకు పెట్టలేదు...?
ఇక అయ్యన్నపాత్రుడయితే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మెట్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. నాలుగేళ్ల నుంచి పరిశ్రమలను ఎందుకు పట్టించుకోలేదని అయ్యన్న ప్రశ్నించారు. హాలిడే ఎందుకు ప్రకటించారని నిలదీశారు. చివరకు విద్యుత్తు సరఫరా విషయంలోనూ పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు సమ్మిట్ పేరుతో అవగాహన ఒప్పందాల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.