ఆరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది;

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ గ్యాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లుగా ఉన్న వారు 27వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ గా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 27న ఏపీలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నిక...
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 27వ తేదీన సెలవు ఈ ఈ ఏడు జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రబుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు.