ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్

ఏపీలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. పది వేల మందికి టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు

Update: 2022-08-30 06:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పది వేల మందికి టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ డీఈవో, ఎంఈవో, ‌హెచ్ మాస్టర్ లుగా పది వేల మందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

22 ఏళ్ల సమస్యకు...
దాదాపు ఇరవై రెండేళ్ల సమస్యకు జగన్ ప్రభుత్వం పరిష్కారం చూపిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులకు అనుమతి మంజూరు చేసింది. 2,300 మంది టీచర్లకు తామ బోధించే సబ్జెక్టును మార్చుకునే అవకాశం కల్పించింది. న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా సెప్టంబరులో పదోన్నతులు ఉండనున్నాయి. అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయి.


Tags:    

Similar News