Andhra Pradesh : కొత్త ఏడాది గుడ్ న్యూస్... ఐఏఎస్ లకు పదోన్నతి

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు నూతన సంవత్సర వేళ ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది.

Update: 2025-01-01 02:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులకు నూతన సంవత్సర వేళ ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం కేంద్రంలో సాల్మన్ ఆరోగ్య రాజ్ డిప్యుటేషన్‌పై ఉన్నారు. కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీెచ్ శ్రీధర్‌కు.. కార్యదర్శి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పలువురు ఐఏఎస్ లకు...

ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా ఉన్నారు. కొత్తగా అక్కడే సీఎం కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాకు పదోన్నతి కల్పించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా వీరపాండ్యన్‌ను నియమించింది. కడప జిల్లా కలెక్టర్‌గా సీహెచ్ శ్రీధర్ కొనసాగనున్నారు. ఇద్దరు ఐపీఎస్‌లు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News