ఢిల్లీలో ఏపీ సర్కార్ కొత్త భవనం
దేశ రాజధాని ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు ప్రభుత్వం ఆహ్వానించింది
దేశ రాజధాని ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు ప్రభుత్వం ఆహ్వానించింది. ఢిల్లీలో నూతన ఏపీ భవన్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీభవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించు కుంటున్నాయి.
టెండర్లకు ఆహ్వానం...
అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించడంతో నూతన భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి ఏపీ సర్కార్ సిద్ధమయింది.