Amaravathi : అమరావతిని నాలుగేళ్లలో పూర్తి చేయగలుగుతారా?

రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా తీసుకుంది. శరవేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది.

Update: 2024-08-25 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా తీసుకుంది. శరవేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. రాజధానిని నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. తొలుత అసెంబ్లీ, సచివాలయానికి శాశ్వత భవనాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస సముదాయాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

అరవై వేల కోట్ల రూపాయలు...
ఇందుకసం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులన్నింటినీ నాలుగేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నిధుల సేకరణ విషయంలోనూ స్పష్టత రావడంతో ఇక టెండర్లు పిలవడమేనని భావిస్తున్నారు. అయితే నవంబరు నెలలో తుఫానుల వంటివి అడ్డంకిగా మారతాయి కాబట్టి డిసెంబరు1 నుంచి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిధుల సమస్య కూడా...
ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ తో ఆసియన్ డెవలెప్‌మెంట్ బ్యాంకు కూడా అమరావతి నిర్మాణానికి రుణాలను అందించేందుకు ముందుకు రావడంతో నిధుల సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం అందుతుంది. వీటితో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేసి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఆహ్వానించి ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరనున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలకు...
201 2019 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు స్థలాలు ఇచ్చాయి. వాటిలో ఏదీ ఇక్కడ ఏర్పాటు కాలేదు. వీటిని ఇక్కడ నిర్మించడం కోసం ప్రత్యేకంగా మళ్లీ ఒకసారి చంద్రబాబు పార్లమెంటు సభ్యులతో ఒక కమిటీ వేసి వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని యాభై ఎనిమిదిఎకరాల్లో ముళ్ల కంచెలు తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబునిర్ణయించారు. మొత్తం మీద నాలుగేళ్లలో ఒక రూపు రేఖలు రాజధాని అమరావతికి తెచ్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.


Tags:    

Similar News