చర్చలకు నో.. జీవో రద్దు చేయాల్సిందే

ఆందోళన బాట పడుతున్న ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు వారిని చర్చలకు ఆహ్వానించింది.

Update: 2022-01-24 02:21 GMT

ఆందోళన బాట పడుతున్న ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు వారిని చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలు జరిపేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటారని చెప్పారు.

ప్రభుత్వం నుంచి.....
ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మలను కమిటీలో నియమించారు. ఈరోజు బుగ్గన ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆయన చర్చలకు హాజరు కాలేరు. అయితే పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేసిన తర్వాతనే తాము చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లేది లేదంటున్నారు.


Tags:    

Similar News