ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మార్చి నాలుగు, లేదా ఏడో తేదీన బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు....
కొత్త జిల్లాల ఏర్పాటును ఆమోదిస్తూ సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త రాజధాని ఏర్పాటు పై కూడా బిల్లు వచ్చే అవకాశం కన్పిస్తుంది. ఉగాది నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈలోగా బడ్జెట్ సమావేశాల్లో వీటికి ఆమోదముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం, ఉద్యోగుల పీఆర్సీ వంటి కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి.