నేడు మున్సిపల్ కార్మికులతో చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో తమ డిమాండ్ల సాధనకు వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం నేడు చర్చలు జరపనుంది

Update: 2024-01-02 03:41 GMT

government will hold talks with the municipal workers who have been on strike for a week in andhra pradesh today    

మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ వేతనాలను పెంచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపేంత వరకూ తాము సమ్మె విరమించబోమని మున్సిపల్ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పెరుగుతున్న చెత్త, చెదారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాయి. వారం రోజులుగా ఏపీలో కార్మికులు సమ్మె చేస్తున్నాయి.

మరో దఫా నేడు...
నేడు మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ రోజు సచివాలయంలో మంత్రులు ఈ కార్మిక సంఘాలతో చర్చించనున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలను సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తుంది. ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష‌్కరించామని ప్రభుత్వం చెబుతుంది. అయితే కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను తీర్చేంత వరకూ తాము సమ్మెను కొనసాగిస్తామని చెబుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టు కార్మికులతో చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి.


Tags:    

Similar News