ఈ బామ్మకు 100 ఏళ్లు పూర్తి.. జన్మదిన వేడుకలకు ఆరుతరాల కుటుంబ సభ్యులు
తమ కుటుంబంలో ఆరు తరాలు వారు కలిసి ఓ వృద్ధురాలు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు..
ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రస్తుతం జీవన శైలిలో రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. యువత నుంచి గుండెపోటు, మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ పూర్వకాలంలో ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎలాంటి టెక్నాలజీ, సరైన ఆహారం లేకున్నా వందేళ్లు బతికేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో 70 ఏళ్లు రాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. కానీ ఈ ఫోటోలు బామ్మను చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈమెకు 101ఏళ్లు పూర్తి చేసుకుని 102వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.
ఈ వృద్దురాలి పుట్టిన రోజుకు ఆరు తరరాల కుటుంబ సభ్యులు హాజరైన ఘనంగా వేడుక నిర్వహించారు. ఆ వేడుక చూసేందుకు ఆ కుటుంబ సభ్యులతో పాటు తమ బంధువులను పిలిచి తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న గౌరవాన్నిచాటి చెప్పే విధంగా పలువురి ప్రశంసలు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన కంచర్ల వెంకట రత్నమ్మ అనే వృద్ధురాలుకు 101 ఏళ్లు పూర్తి చేసుకుని 102 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు తమ తర తరాలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు.
జన్మదిన వేడుకలలో వృద్ధురాలి కూతుర్లు, అల్లుళ్లు, వారికి జన్మించిన సంతానమైన మనువళ్లు, మనువరాళ్లు, అదేవిధంగా వారికి పుట్టిన సంతానమైన ముని మనవాళ్లు ముని మనుమరాళ్లు ఇలా మొత్తం కలిపి ఆరు తరాలకు చెందిన మొత్తం 72 మంది ఈ వేడుకలో పాల్గొని ఘనంగా జన్మదిన వేడులకు నిర్వహించారు. ఒకే వేదికపై ఇంత మంది కనిపించడం ఆ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది.వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ బామ్మకు ఇప్పుడున్న తరాలవారరు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.